రేపు ప్రతియుతి యోగంతో ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతున్నారు!
నవగ్రహాలు వేటికవే ప్రత్యేకమైనవి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, ఒక నక్షత్రంలో నుంచి మరొక నక్షత్రం లోనికి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో సెప్టెంబర్ 17వ తేదీన బుధుడు మరియు శని 180 డిగ్రీల వద్ద ఎదురుగా రావడం వల్ల ప్రతియుతి యోగం ఏర్పడుతుంది.
ఈ రాశుల వారికి అదృష్టం
ఈ ప్రతియుతి యోగం వారికి వివిధ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశులవారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. ఈ సమయంలో అదృష్టం ప్రకాశించే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి శని, బుధుల కలయిక శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి కొత్త ఆర్డర్లు వస్తాయి. మిధున రాశి వారికి ఈ సమయంలో చాలా డబ్బు వస్తుంది.
తులారాశి
50 ఏళ్ల తర్వాత మిత్ర గ్రహాలైన శని బుధులు కలయిక కారణంగా తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పనిచేసే చోట పురోగతి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలను పొందుతారు.
మీనరాశి
శని బుధుల కలయిక కారణంగా ఏర్పడే ప్రతియుతి యోగంతో మీన రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారి కెరీర్ బాగుంటుంది. ఏ పని చేసినా మంచి జరుగుతుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉండవు. ఈ సమయంలో అన్ని విధాల లాభాలే వస్తాయి. ఉద్యోగస్తుల పైన ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంటుంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications