వినాయక చవితికి అరుదైన యోగంతో సంపదలో మునిగితేలే రాశులవారు వీరే!
ఆగస్ట్ 27న వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా విశేషంగా జరుపుకోవడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇక ఈసారి వినాయక చవితి పండుగ నాడు ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది. వినాయక చవితి పండుగ నాడు నవ పంచమ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభాలు జరగబోతున్నాయి. సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నవపంచమ రాజయోగం ఏర్పరుస్తూ ఉన్నాడు. దీంతో అదృష్టవంతులు అయ్యే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
వినాయక చవితి పండుగతోపాటు నవ పంచమ రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది . చవితి నుండి మేషరాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు పొందుతారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. మేషరాశి వారి కోరికలు నెరవేరుతాయి. కొత్త ఇల్లు. వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేసే వారికి ఊహించని ఆదాయం లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇప్పటినుండి తిరుగుండదు.

కర్కాటక రాశి
గణేష్ చతుర్థి రోజున ఏర్పడే నవ పంచమ రాజయోగం కర్కాటక రాశి జాతకులను అదృష్టవంతులుగా మారుస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అనేక మార్గాల నుండి డబ్బు వస్తుంది. నూతన ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంటుంది. పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పెళ్లిళ్లు కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. ఇది అన్ని విధాల కర్కాటకరాశి జాతకులకు శుభ సమయం.
మీన రాశి
గణేష్ చతుర్థి రోజున ఏర్పడే నవ పంచమ రాజయోగం మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశి జాతకులు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కళా రంగంలో ఉండే వారికి ఇది చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలలో మంచి మార్కులు సాధించి విజయం సాధిస్తారు. మీన రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications