బృహస్పతి అనుగ్రహం.. ఈ రాశుల తలుపు తడుతున్న అదృష్ట దేవత

నవగ్రహాల్లో కీలకమైన గ్రహం బృహస్పతి. దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించి ఆధ్యాత్మికతవైపు నడిపిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. సంతానం కలగడానికి, సంపదకు, శ్రేయస్సుకు కారకుడు. జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటే వారికి తిరుగులేదు. అలా లేకపోయినప్పటికీ శివాలయంకానీ, ఇతర ఆలయాల్లోకానీ నవగ్రహాలకు ప్రతిరోజు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. జాతకంలో గురువు బలంగా ఉంటే వారికి వివాహం అవుతుంది. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న గురుడు వచ్చే నెల 9వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసి రానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. గురుడి సంచారం వల్ల ఉద్యోగాలు చేస్తున్నవారికి బాగా కలిసివస్తుంది. వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంటుంది. అన్ని రంగాల్లో విజయాలను అందుకునేలా గురుడు తోడ్పడతాడు. ఆయనపై అధికంగా నమ్మకం ఉంచాలి.

With the blessings of Jupiter the lives of these four zodiac signs will take a miraculous turn

మేష రాశి
అదృష్టం తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. వృత్తి జీవితంతోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా మంచి పురోగతి సాధిస్తారు.

కుంభ రాశి
వృత్తిలో, వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కుటుంబంతో అధిక సమయ గడపడానికే ప్రాధాన్యతనిస్తారు. వారితో కలిసి తీర్థయాత్రలకుకానీ, విహార యాత్రలకు కానీ వెళతారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండాలి.

సింహ రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహం అవనివారికి త్వరలోనే వివాహం అయ్యేలా గురువు అనుగ్రహిస్తాడు. ఏ రంగంలోకి అడుగుపెట్టినా, ప్రస్తుతం ఏ రంగంలో ఉన్న గొప్ప విజయాన్ని సాధించబోతున్నాడు. గత కొద్దికాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకొని నలుగురికి సాయం చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+