కుజుడి దయతో ఈ రాశులకు కొత్త సంవత్సరంలో అన్నీ వస్తున్నాయి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాలను ఏర్పరిచి రాశి చక్ర గుర్తులకు మేలు చేస్తుంటాయి. అలాగే కొత్త సంవత్సరంలో జనవరి 16వ తేదీన కుజుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశికి శనిదేవుడు అధిపతి. మకర రాశిలోకి కుజుడి ప్రవేశం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. కొన్ని రాశులవారి ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని, వ్యక్తిగత జీవితం బాగుంటుందని తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. రుణ సమస్యల నుంచి బయటపడతారు. అయితే కొన్ని మిగిలే ఉంటాయి. ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతూ వస్తాయి. ఏ పనినైనా చేయగలుగుతారు. ఊహించని స్థాయిలో ధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగాల్లో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

With the blessings of Mars these zodiac signs will receive everything in the new year

మేష రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఊహించని స్థాయిలో పనులు విజయవంతం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు అందుతాయి. వేతనం పెరిగి పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాలకు కూడా ఇదే స్థాయిలో లాభాలున్నాయి. అయితే వ్యాపారస్తులు తమ కోపాన్ని నిగ్రహించుకుంటే వారికి లాభాల పంట పండుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశివారి కెరీర్ చాలా బాగుంటుంది. పనితీరుపై ప్రశంసలు వస్తాయి. అనుకున్న పనులు వెంటనే పూర్తిచేసే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. చేసే పనిలో ప్రశాంతత లభిస్తుంది. పై అధికారుల నుంచి మంచి గౌరవాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే సమయం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+