శుక్రుడి దయతో ఈ ఏడాది ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారాన్ని అరుదుగా పరిగణిస్తారు. ఈనెల 4వ తేదీన ఉదయం ఆరు గంటల 15 నిమిషాలకు కర్కాటక రాశిలో శుక్రుడు తిరోగమనం నుండి ప్రత్యక్ష కదలికకు వెళ్లారు. ఈ పరివర్తన 12 రాశి చక్రాల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద దీని తీవ్ర ప్రభావం ఉన్నప్పటికీ, ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
ముఖ్యంగా రెండు రాశుల వారు ఈ ఏడాది శుక్ర సంచారం వల్ల లబ్ధిని పొందుతారు. కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి బాగా లాభిస్తుంది. కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.

ఈ సంవత్సరం శుక్రుడు కర్కాటక రాశిలో ప్రత్యక్షంగా మారడం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు అత్యంత శుభప్రదం. ఈ కారణంగా వీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. సంపద వృద్ధి చెందుతుంది. కొత్త పరిచయాలు, ఉన్నత అవకాశాలు వీరికి వస్తాయి .ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు పెట్టినవారికి గణనీయమైన లాభాలు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉన్నందున, వ్యక్తిగత వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల కన్యారాశి జాతకులకు గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆర్థికంగా కన్యా రాశి వారు చాలా పటిష్టంగా మారుతారు. మొండి బాకీలు వారికి వసూలు అవుతాయి. ఈ సమయంలో వినూత్న ఆలోచనలు చేయడం వల్ల వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి.
కమ్యూనికేషన్ విషయంలో కన్యారాశి వారు గతాని కంటే భిన్నంగా చాలా మెరుగుదలను చూస్తారు. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకమైన సంబంధం కొనసాగుతుంది. సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా జీవించటానికి ఇది సరైన సమయం. కన్య రాశి వారు ఈ సమయంలో ఉన్నతాధికారులపై, ఇతరులపై సానుకూలమైన ముద్రను వేస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications