2025లో బృహస్పతి సంచారంతో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం, ఏడాదంతా రాజభోగం!
2025 లో బృహస్పతి తన రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న బృహస్పతి 2025వ సంవత్సరంలో మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. దేవ గురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు.
2025 లో బృహస్పతి సంచారం
కానీ 2025 లో బృహస్పతి మే 14వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంవత్సరం చివరలో తిరోగమన దిశలో భాగంగా డిసెంబర్ 5న కర్కాటక రాశి నుండి మిధున రాశికి మారుతున్నాడు. ఇలా బృహస్పతి 2025 లో రాశి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి
2025లో బృహస్పతి సంచారం కారణంగా మేష రాశి జాతకులకు మంచి జరుగుతుంది. మీరు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సంతోష వాతావరణ ఉంటుంది. విద్యా రంగంలో ఉన్న మేషరాశి జాతకులకు ఇది శుభ సమయం. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసొస్తుంది.
మిధున రాశి
2025లో మిధున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ రాశి వారికి అవివాహితులకు వివాహాలకు కుదురుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
సింహరాశి
2025 లో సింహ రాశి వారికి బృహస్పతి సంచారం శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతమవుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. మీరు జీవితంలో సంపాదన, శ్రేయస్సును పొందుతారు. శుభకార్యాలను చేస్తారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
తులారాశి
2025లో బృహస్పతి సంచారం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరికి గతంలో ఉన్న కేసులు అన్ని పరిష్కరించబడతాయి. కోర్టులో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఎప్పటినుండి నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికందుతాయి. ఈ ఏడాది వీరికి ఆర్ధిక పురోగతి సాధ్యమవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications