త్రిగ్రాహి యోగంతో సంపదల ఖజానా మోసుకెళ్తున్న రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశిలో మూడు పెద్ద గ్రహాలైన సూర్యుడు, బుధుడు మరియు శని త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరిచారు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు ఫిబ్రవరి 11వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఆపై సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీన కుంభరాశిలో సంచారం ప్రారంభించాడు. ఇక కుంభరాశిలో ఈ మూడు ముఖ్య గ్రహాల కారణంగా త్రిగ్రాహియోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా ముఖ్యంగా ఐదు రాశులవారికి ప్రయోజనం చేకూరుతుంది..
మేషరాశి
కుంభరాశిలో త్రిగ్రాహి యోగం కారణంగా మేష రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకుల కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది.నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. సమాజంలో పరువు మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి
కుంభరాశిలో త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారికి కలిసి వస్తుంది.
మిధున రాశి
కుంభరాశిలో త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి వారికి మంచి జరుగుతుంది. మిధున రాశి వారికి ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ వృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఇది అన్ని విధాలా మిధున రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది.
కన్యారాశి
త్రిగ్రాహి యోగం కారణంగా కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. జీతం పెరుగుతుంది. పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల పై అధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కన్యా రాశి వారి పని ప్రశంసించబడుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక మంచి సమయం. కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications