జనవరి 28న మాలవ్య రాజయోగంతో వీరికి మహారాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహంగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు. ఈ గ్రహం జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. మీనరాశిలోకి శుక్ర గ్రహ సంచారం కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.
మాలవ్య రాజయోగం
ఈ మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశుల వారి చిరకాల కోరికలు నెరవేరుతాయి. అయితే జనవరి 28వ తారీకు నుండి మాలవ్య రాజయోగంతో నుండి లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య రాజయోగంతో ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వీరికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది.
వృషభరాశి
శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య రాజయోగంతో వృషభ రాశి జాతకులకు బోలెడు లాభాలు ఉన్నాయి. వీరి చిరకాల కోరికలు తీరుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. శత్రువు పైన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి అదృష్ట కాలం.
మిధున రాశి
శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మాలవ్య రాజయోగం మిధున రాశి వారి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. మిధున రాశి జాతకులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మిధున రాశి వారి పనులలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. ఇది వీరికి అనుకూల కాలం.
కర్కాటక రాశి
మాలవ్య రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో వ్యాపారం చేస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఊహించని డబ్బు వస్తుంది. మతపరమైన విషయాల పైన ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆసక్తి పెరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications