త్వరలో రోహిణి నక్షత్రంలో శుక్ర గోచారంతో ఈ రాశులవారికి రాజభోగాలు!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి శుక్రుడు సూర్యునికి రెండవ గ్రహం. సౌరవ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా కూడా శుక్రుడికి పేరు ఉంది. ప్రేమకు, విలాసాలకు సూచికగా, అందానికి, సంపదకు, కళలకు కారకుడిగా శుక్రుడిని చెబుతారు. అటువంటి శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు.

రోహిణి నక్షత్రంలో శుక్ర సంచారం
జూలై 8వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 31 నిమిషాలకు శుక్రుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. రోహిణి నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి శుక్ర సంచారం కారణంగా అదృష్టవంతులు అవుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

With Venus transiting Rohini nakshatra soon these zodiac signs will enjoy royal life

వృషభ రాశి
వృషభరాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు శుభ ఫలితాలకు కారణమవుతుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రమోషన్ లను, ఇంక్రిమెంట్ లను పొందుతారు. నూతన ఆదాయ మార్గాల ద్వారా ఎక్కువ డబ్బును సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. వృషభరాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో ప్రాజెక్టులు, కాంట్రాక్ట్ వర్క్ లు కలిసి వస్తాయి. శుక్రుడి నక్షత్ర మార్పు వలన కుటుంబంలో సమస్యలు తొలగిపోయి ఫ్యామిలీ సంతోషంతో జీవిస్తారు.

కర్కాటక రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులకు కొత్త అవకాశాలు వస్తాయి. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సక్సెస్ సాధిస్తారు. కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులారాశి
శుక్రుడి నక్షత్ర మార్పు తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు కొత్త కాంట్రాక్టులను స్వీకరిస్తారు. ఆర్థికంగా తులా రాశి వారికి కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగ పరంగాను సానుకూలత వస్తుంది. ఇది తులా రాశి వారికి మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+