నాగపంచమి నాడు అద్భుత శుభయోగాలు.. వీరికి ఆకస్మిక ధనలాభాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశులవారిపైన ప్రభావం పడుతుంది. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. రేపు నాగ పంచమి. శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి చాలా స్పెషల్. ఈ నాగపంచమి నాడు అనేక శుభయోగాలు బుధ శుక్ర సంయోగం, కుజ గురు గ్రహాల సంయోగం జరగనున్నాయి.
నాగపంచమి నాడు శుభయోగాలు
ఈ నెలలోనే సింహరాశిలో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని, కుంభరాశిలో శని శశరాశి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. అంతేకాదు నాగపంచమి రోజున సిద్ధయోగం, రవి యోగం, సంధ్యాయోగం కూడా ఏర్పడుతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మేషరాశి
నాగ పంచమి రోజున ఏర్పడే శుభయోగాల కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మేష రాశి వారికి ఆదాయానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించగలుగుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ధన లాభాలు ఉంటాయి.జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే సమయం.
సింహరాశి
నాగపంచమి నాడు సింహరాశిలోనే రెండు శుభయోగాలు ఏర్పడ్డాయి. నాగపంచమి నాటి సింహరాశిలో ఏర్పడిన శుభయోగాల కారణంగా సింహరాశి జాతకులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది . అయితే సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
వృషభరాశి
వృషభ రాశి వారికి నాగ పంచమి నాడు ఏర్పడే శుభయోగాల కారణంగా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఒప్పందాలు చేసుకుంటారు .ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల మద్దతు దొరుకుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి ఉంటాయి. మతపరమైన కార్యకలాపాల పైన కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications