మహా శివరాత్రి వేళ శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు.. చెయ్యాల్సిందల్లా!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో మహాశివరాత్రి పర్వదినానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశ తిథినాడు వచ్చే మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన వస్తుంది. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన అరుదైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.

కొన్ని రాశులపై శివయ్య కటాక్షం
శ్రవణా నక్షత్ర యుక్తంగా వస్తున్న మహాశివరాత్రి త్రిగ్రాహి యోగాన్ని, సర్వార్ధ సిద్ధి యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే మహాశివరాత్రి వేళ కొన్ని రాశులపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో.. వారు ఏం చేస్తే పరమశివుని కటాక్షాన్ని పొందగలుగుతారో తెలుసుకుందాం.

Zodiac signs that receive special blessings from Lord Shiva on Maha Shivaratri All you need to do is

మేష రాశి
మేషరాశి వారికి అంగారకుడు అధిపతి. మేషరాశి వారిపైన శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మేషరాశి వారు మహాశివరాత్రి పర్వదినాన శివ పూజ సమయంలో నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మేషరాశి వారు ఈశ్వరుడికి ఎర్రటి పువ్వులు, ఎర్రచందనం, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివకటాక్షం లభిస్తుంది. శివునికి పాలతోనూ, గంగాజలంతోను అభిషేకం చేస్తే మేషరాశి వారు ఉద్యోగ జీవితంలో పురోగతిని సాధిస్తారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా అంగారకుడు అధిపతిగా ఉంటాడు. వీరి పైన కూడా శివకటాక్షం ఉంటుంది. మహాశివరాత్రి వేళ వీరు రుద్రాష్టకం పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. వీరు గులాబీ పువ్వులను, బిల్వపత్రాలను శివుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి
మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. మహాశివరాత్రి పర్వదినాన మకర రాశి వారు శివుడికి అభిషేకాలు, అర్చనలు చేస్తే సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. విజయాలు వరిస్తాయి. ఈ రాశి వారు ధతురా, అష్టగంధ తదితర వస్తువులతో శివయ్యను పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు మహాశివరాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంతే కాదు శివాష్టకాన్ని పఠిస్తే, శక్తి సామర్ధ్యాల మేరకు శివరాత్రి వేళ దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది. అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+