బృహస్పతి సంచారంతో 2025లో దరిద్రాన్ని ఎదుర్కొనే రాశులివే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతి 12 నెలల పాటు ఒకే రాశిలో సంచరిస్తాడు. ఏడాదికి ఒకసారి బృహస్పతి తన రాశిని మార్చుకుంటాడు. అటువంటి బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

2025లో బృహస్పతి సంచారం
2025 సంవత్సరంలో బృహస్పతి మే 14వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తుంది అక్టోబర్ 18 వ తేదీన తిరిగి మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళుతుంది ఆ తర్వాత మళ్లీ నవంబర్ 11వ తేదీన తిరోగమన చెంది డిసెంబర్ 5వ తేదీన తిరిగి మిధున రాశికి చేరుకుంటుంది.

Zodiac signs that will face poverty and difficulties in 2025 due to Jupiter transit

బృహస్పతి సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు పొందే రాశులు
అతిచార స్థితిలో బృహస్పతి తన వేగాన్ని మూడు రెట్లు వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా చాలా తక్కువ సమయ వ్యవధిలో ఈ సంవత్సరం రాశి చక్రాన్ని మారుస్తుంది. మళ్లీ యధాస్థితిలో మిధున రాశిలోకి వస్తుంది. బృహస్పతి కారణంగా ప్రతికూల ఫలితాలు పొందే రాశుల వివరాలలోకి వెళితే..

మిధున రాశి
2025లో బృహస్పతి సంచారం మిధున రాశి జాతకుల ఆర్థిక జీవితాల్లో అనేక సవాళ్లను విసురుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం మీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు దారితీస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు వైఫల్యాలను చూస్తారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిది.

ధనుస్సు రాశి
బృహస్పతి సంచారం ధనుస్సు రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అపార్థాలకు కారణం అవుతుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి .లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో నష్టాలను నివారించడానికి డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి
2025 సంవత్సరం మకర రాశి వారికి బృహస్పతి సంచారం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మకర రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరికి పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది. అధిక ఖర్చులను నివారించాలి. ఉద్యోగస్తులు కూడా ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి
2025లో బృహస్పతి రవాణా మీన రాశి వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆస్తులు కొనాలి అమ్మాలి అనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం పనిభారం పెరిగే అవకాశం ఉంది ఒత్తిడి, అలసటను ఫీల్ అవుతారు. ఇది మీన రాశి వారు ఓపికగా ఉండాల్సిన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+