మాఘ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. పరిశీలించుకోండి
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కేతువు ఏప్రిల్ 20వ తేదీన తన సొంత నక్షత్రమైన మాఘ నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. కేతువు ఛాయా గ్రహం. ప్రతి 18 నెలలక ఒకసారి తన రాశిని మారుస్తుంటుంది. అలాగే నక్షత్రాన్ని కూడా అరుదుగానే మారుస్తుంటుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు ఆధ్యాత్మిక వాతవరణంవైపు మొగ్గు చూపుతారు. జీవితాల్లో ప్రత్యేకమైన మార్పులు సంభవిస్తాయి. కేతువు నక్షత్రాన్ని మార్చుకోవడంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వ్యాపారస్తులు భారీ విజయాలను సాధిస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించడంతోపాటు వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటారు. ఉద్యోగాలు చేస్తున్నవారి జీవితంలో ఊహించని మార్పలు వస్తాయి. ఉన్న రుణాలను తీర్చేస్తారు. అయితే కొత్తగా అప్పులు చేయవద్దని పండితులు తెలియజేస్తున్నారు.

సింహరాశి
వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. పనుల్లో కొత్త బాధ్యతలను ఉద్యోగస్తులు స్వీకరిస్తారు. కొంతకాలం ఎదుర్కొంటున్న మొండి సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలను అందుకుటారు. అనేక రంగాల్లో ఈ రాశివారు విజయాలు సాధిస్తారు.
మకర రాశి
ఆర్థికంగా ఈ రాశివారు బలవంతులవుతారు. గతంలో కంటే బలోపేతమవుతారు. కుటుంబంలో శాంతి కలుగుతుంది. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. వచ్చిన డబ్బున పొదుపు చేసుకోవాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
వృషభ రాశి
కొంతకాలంగా వేధిస్తున్న పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. అంతేకాకుండా వారి జీతం కూడా పెరుగుతుంది. కొత్తగా ఆదాయం కోసం వనరులు అందుబాటులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకరకంగా ఈ రాశివారికి అద్భుతమైన అవకాశాలున్నాయని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications