• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2019 వార్షిక రాశిఫలాలు: మీ జాతకం చూసుకోండి..

By Staff
|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు, ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151

జ్ఞాననిధి, జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్", ఎం.ఏ తెలుగు (ఏల్), ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ, ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం),

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు, మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్..

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

మేషరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మేషరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మేషరాశి వారికి 2019 లో గోచార గ్రహస్థితి ప్రకారం ఆరోగ్యం అస్థిరంగానే ఉంటుంది. మీరు ఈ సంవత్సరంలో, మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగానే ఉంటారు కాబట్టి, సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో, మీరు చిన్నచిన్న ఒత్తిళ్లను లేకుండా చూసుకుంటే మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది.ఈ సంవత్సరం, మీరు కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు చేసే అద్భుతమైన ప్రయత్నాలు మీకు విజయం సాధించిపెడతాయి. మీ ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది.

మీ కెరీర్లో తర్వాతి దశకు చేరడంలో అదృష్టం మీకు మేలు చేస్తుంది.సంవత్సరం ప్రారంభం నుండి మీరు మీ ప్రాజెక్టులలో కష్టపడి పని చేస్తారు. ఇది భవిష్యత్తులో మీరు ప్రయోజనం చేకూరేలా చేస్తుంది. ఆర్థిక పరిస్థితిలో అస్థిరత కనబడుతుంది. సంవత్సర ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కానీ మీ ఖర్చులు ఈ సమయంలో పెరుగుతాయి.అకస్మాత్తుగా పలు అనవసరమైన ఖర్చుల సంఖ్య పెరుగుతుంది. దీనిని నియంత్రించుకోలేకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.

సంవత్సరం మధ్యలో (జూన్-జూలై)లో మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఇది మీకు ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది.ప్రేమ జీవితం మారదు. మీ సంబంధాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవడానికి మీరు మీ ప్రేమలో పారదర్శకతను పాటించవలసి ఉంటుంది.

వృషభరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

వృషభరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

వృషభ రాశి వారికి 2019 ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. 2019 అంచనాల ప్రకారం మీరు ఈ ఏడాదిలో దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభ దశలో మీరు మీ కెరీర్ కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు .కెరీర్లో హెచ్చు తగ్గులు ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందడానికి మీరు తీవ్రంగా కృషి చేయాలి .

ఈ సంవత్సరం అంతటా మీ కెరీర్ పట్ల తీవ్రంగా కృషి చేస్తారు. దానికోసం మీరు మీ కెరీర్లో మీకంటూ ఒక ఒక ప్రత్యేకతను సృష్టించుకోవడానికి కూడా కృషి చేస్తారు.ఆర్ధిక జీవితం సాధారణం కంటే మెరుగైనదిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోకపోతే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.

ఏదేమైనప్పటికీ మాత్రం మీ ఆదాయాలు ఈ సంవత్సరంలో పెరగవచ్చు.మీకు నూతన ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి.ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది అలాగే జూన్ అంతటా కొనసాగుతుంది.

మిధునరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మిధునరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మిధునరాశి 2019 సంవత్సర ప్రకారం మీరు ఈ సంవత్సరంలో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు అప్పుడప్పుడూ చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి నెలలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో మీరు ఒక చర్మ సంబంధిత సమస్యను ఎదుర్కునే అవకాశం ఉంటుంది.ఈ సంవత్సరం మీ కెరీర్ సాధారణంగా ఉండవచ్చని గ్రహస్థితి చెబుతోంది. మీరు కష్టపడని పని చేస్తే మాత్రం ఈ సంవత్సరంలో మీ కెరీర్ ఊపందుకుంటుంది.మీరు మీ పని మీద దృష్టి పెట్టాలి.

మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి మీరు కొత్త ఆలోచనలు సృష్టించుకోవాలి.సీనియర్ సిబ్బంది సలహా కూడా మీకు పనికి వస్తుంది.ఈ సంవత్సరం మీ ఆర్థిక జీవితంపరంగా గొప్ప అభివృద్ధిని సాధిస్తారు.ఆర్థిక లాభాలు రాగలిగేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీ ఆర్ధిక లాభాలను పెంచుకోవటానికి సహాయపడతాయి.మీరు ఈ సంవత్సరంలో డబ్బును పొదుపు చేయడంలో విజయవంతం అవుతారు.అయితే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మీ ఇంటి నుండి దూరంగా వెల్లవలసి రావచ్చు.

కర్కాటక వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కర్కాటక వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో కెరీర్ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండవచ్చని అయినప్పటికీ ఆరోగ్యానికి ముందు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది అంతా మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించవచ్చు.కెరీర్ గురించి మాట్లాడినట్లయితే వృత్తి నిపుణులు తమ ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకోవచ్చు. ఫిబ్రవరి నెల నుండి మార్చి నెల వరకు మరియు నవంబరు నుండి డిసెంబరు వరకు మీరు ఉద్యోగం మరియు వ్యాపార పరంగా శుభవార్తలు పొందుతారు.

మార్చి నెల తర్వాత మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టవచ్చు లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించవచ్చును. ఇప్పుడు ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో అనేక ద్రవ్య ప్రయోజనాల అవకాశాలు ఉన్నాయి.మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలు ద్రవ్య సంబంధ విషయాలకు గొప్పగా ఉంటాయి.

ఈ కాలంలో ఆదాయం మరియు ఆర్థిక లాభాల పెరుగుదల మీ ఆర్థిక హోదాను బలోపేతం చేస్తుంది మరియు మీ సాంఘిక హోదాను పెంచుతుంది. ద్రవ్య లాభాలకు తోడు మీరు ఈ సంవత్సరంలో డబ్బు నష్టం ఎదుర్కోవాల్సి ఉండవచ్చు.అందువలన ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఫండ్స్ మరియు మూలధన పెట్టుబడుల సంబంధిత ప్రణాళికలకు తెలివిగా మరియు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయండి.

సింహరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

సింహరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

సింహరాశి వారికి 2019 ప్రకారం ఈ ఏడాది మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది.ఈ సంవత్సరం ప్రారంభ నెలల్లో మీరు జలుబు లక్షణాలతో బాధపడవచ్చు. మీరు శారీరకంగా అలసట మరియు నిస్సత్తువ లక్షణాలను అనుభవిస్తారు. అయితే ఫిబ్రవరి మధ్య నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ కెరీర్లో విజయాన్ని పొందడం కోసం కష్టపడాలి .కెరీర్ పరంగా మీరు విజయవంతమైన ఫలితాలు పొందినా ఈ ఫలితాలతో సంతృప్తి చెందరు.

కార్యాలయంలో మీ శ్రద్ధ మీకు ఒక కొత్త గుర్తింపును ఇస్తుంది. అంతేకాకుండా మీరు కొత్త కార్యాలయంలో పనిచేయడానికి కూడా అవకాశం పొందుతారు. 2019 యొక్క ప్రారంభంలో మీరు కెరీర్లో రంగంలో మంచి ఫలితాలు పొందుతారు.ఈ సంవత్సరంలో మీరు మీ ఆర్థిక జీవితంలో చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చును అయిననూ ఈ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మీరు గొప్ప ఫలితాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జనవరి నెల దాటిన తరువాత ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ నెలలు మీకు నష్టాన్ని తీసుకురావచ్చు జాగ్రత్త వహించండి.

మీకు ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో సవాలు ఎదురవుతుంది.అందువలన మీరు ఈ సంవత్సరంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రేమ భాగస్వామితో వాదోపవాదానికి అవకాశం ఉంది లేదా ఇతర కారణాల వలన కొన్ని ఇబ్బందులకు దారి తీస్తుంది.

కన్యారాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కన్యారాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కన్యారాశి వారికి 2019 ప్రకారం మీ ఆరోగ్యం ఈ సంవత్సరం అనేక హెచ్చు తగ్గులు ఎదుర్కొంటుంది. అలాగే మీరు మీ ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఉదాహరణకు ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మీ ఆరోగ్య స్థితిలో పతనాన్ని కూడా చూస్తారు. మీరు మీ కెరీర్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.ఇక్కడ మీరు నిరాశ చెందాల్సి ఉంటుంది.దీనికి విరుద్ధంగా మీరు విజయం సాధించడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి వ్యక్తులు తమ సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాల ద్వారా వృత్తి పరమైన విజయాన్ని సాధిస్తారు. మీ ఆర్థిక జీవితం సాధారణం కంటే మెరుగైనదిగా ఉంటుంది. దానిని మీరు ఈ ఏడాది ప్రారంభంలో తెలుసుకోవడం ప్రారంభిస్తారు .జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో మీరు వివిధ వనరుల నుండి ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఈ సమయంలో మీ ఖర్చులు పెరగవచ్చును. అయినప్పటికీ పరిస్థితులు ఇంకా మీ నియంత్రణలోనే ఉంటాయి. 2019 సంవత్సరం మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది.ఈ సమయంలో మీరు ఒడిదుడుకులు చూడవలసి ఉంటుంది. 2019 రాశిఫలం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో ప్రేమ జీవితానికి అనుకూలం కాదు.ఈ సమయంలో మీరు ప్రేమ జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగం / వ్యాపారం కారణంగా మీరు ఇంటి నుండి దూరంగా ఉండవలసి ఉంటుంది.

తులారాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు:

తులారాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు:

తుల రాశి వారికి 2019 ప్రకారం మీ ఆరోగ్యం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కేవలం ఆరోగ్య ప్రయోజనాలు పొందడమే కాదు చాలా కాలంగా ఇబ్బందిపెట్టే దీర్ఘ వ్యాధుల నుండి కూడా బయటపడతారు.మీరు కెరీర్లో మంచి ఫలితాలను అందుకుంటారు .మార్చి తరువాత మీ క్రొత్త ఆలోచనలు విజయవంతం కావడానికి మీరు సహాయం చేస్తాయి. ఈ సమయంలో మీరు పని ప్రాంతంలో మంచి ఫలితాలు పొందుతారు. సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. కానీ అది మీరు వారి నుండి ఆశించినంత విధంగా ఉండదు. అందువల్ల వారిపై గుడ్డిగా ఆధారపడవద్దు.ఆర్థిక రంగంలో మీరు ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.

ఆర్థికపరంగా విధి కూడా మీకు సహాయపడటం వల్ల మీ ఆర్థిక స్థితికి బలోపేతం కావడానికి అనేక అవకాశాలు ఉంటాయి.ఈ సంవత్సరంలో మీరు ఒకరితో ఒక కొత్త సంబంధాన్ని నిర్మించుకుంటారు. మీరు ప్రేమ భాగస్వామి పట్ల నిష్కల్మషంగా ఉంటారు.మీరు ఏదైనా వినోద స్థలానికి వెళ్ళె అవకాశం కూడా ఉంది.వినోద ప్రయోజనం కోసం కూడా మీరిద్దరూ ఎక్కడికైనా కలిసి వెళ్తారు.అయితే నిరుత్సాహాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవచ్చు .మీరు ఇంటి లోపల శాంతి మరియు ఆనందముతో సంతోషంగా ఉంటారు. సంవత్సరం మధ్యలో ఒక గొప్ప వార్త మిమ్మల్ని ఆనందింపచేయవచ్చు. ఈ సమయంలో ఇంట్లో ఒక శుభ కార్యక్రమం ఉండవచ్చు.

వృశ్చిక రాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

వృశ్చిక రాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

వృశ్చిక రాశి వారికి 2019 మీ ఆరోగ్య పరిస్థితిని గమనించాలని సూచిస్తోంది. మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి.మీరు ఫిట్నెస్ సమస్యను ఎదుర్కోవవచ్చు.మీ ఆరోగ్యం క్షీణించినట్లయితే నిర్లక్ష్యం చేయకండి. మీ వ్యాధికి వెంటనే చికిత్స పొందండి. ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో మీ ఆరోగ్యం ఒకింత సున్నితంగా ఉండవచ్చు.దీనికి విరుద్ధంగా కెరీర్లో ఒక రూపాన్ని మీ వృత్తి జీవితంలో గొప్ప ఫలితాలను స్వీకరించడానికి అధిక అవకాశాలు ఉన్నాయి.

మీ కెరీర్ లో విజయం పొందుతారని ముందు ముందు మీకు కెరీర్ పరంగా అనేక బంగారు అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చు .మీరు మంచి కంపెనీ నుండి ఉద్యోగ అవకాశం పొందవచ్చు. పని కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీ ఆర్థిక జీవితంలో మిశ్రమ ఫలితాలను ఈ సంవత్సరం అందిస్తుంది. మీరు ఆర్ధిక పురోగతిపై హెచ్చు తగ్గుదలని గమనించవచ్చు. మీరు మీ ఖర్చులు మరియు ఆదాయ మధ్య తేడా కనుగొంటారు. కాబట్టి మీ ఆర్థిక జీవితంలో ఆదాయం మరియు ఖర్చుల మధ్య సరైన సర్దుబాట్లు చేయండి.మరొక వైపు ఈ సంవత్సరంలో మీ ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రియమైనవారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వలన సంబంధం బలోపేతం అవుతుంది.

ధనుస్సు వారికి 2019 సంవత్సర రాశిఫలాలు:

ధనుస్సు వారికి 2019 సంవత్సర రాశిఫలాలు:

2019 ధనుస్సు రాశి వారికి గ్రహచార ప్రకారం ఈ సంవత్సరం మొదటి నెలలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ప్రయాణంలో అలసిపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కెరీర్ పరంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్ లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లేదా మీ ప్రస్తుత జీతం పెంపుదల ఉండవచ్చు. మరోవైపు ఆర్ధిక రంగాలకు సంబంధించిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు వివిధ వనరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. పూర్వీకుల ఆస్తి పెరుగుతుంది.

మీ కుటుంబం మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యేందుకు సహాయం చేస్తుంది.మీరు ఏదైనా వ్యాపారాన్ని చేస్తే లేదా సంస్థను స్థాపించినట్లయితే మీకు ఆర్ధిక లాభాలుంటాయి .మీరు ఈ సంవత్సరం అంతా మీ ప్రేమ జీవితం గురించి మరింత సీరియస్ గా ఉంటారు. భాగస్వామితో వివాదం ఉన్నట్లయితే దానిని పెద్దది చేసుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగానే ఉంటుంది.తల్లిదండ్రులు మాత్రం చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

మకరరాశి వారికి 2019 సంవత్సర రాశి ఫలాలు:

మకరరాశి వారికి 2019 సంవత్సర రాశి ఫలాలు:

మకరం రాశి వారికి 2019 ప్రకారం ఇది మీకు మంచి సంవత్సరం. అయినప్పటికీ ఆరోగ్య కారణాల వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. తొలుత మూడు నెలలలో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీ ఆరోగ్యం మంచి స్థితిలోనే ఉంటుంది.ఈ సమయంలో మీరు శక్తిమంతంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కానీ ఆ తరువాత ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెలలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్ధిక జీవితం హెచ్చు తగ్గుదలను కలిగి ఉంటుంది.ఈ సంవత్సరంలో మీ వ్యయాల పెరుగుదలకు అవకాశం ఉంది. కానీ ఆదాయం పెరుగుదలపరంగా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ సంబంధాల వల్ల ఆర్థిక ప్రయోజనం పొందటానికి బలమైన సంభావ్యత ఉంది. మీరు ఉద్యోగస్తులైతే యాజమాన్యం నుండి ప్రమోషన్ లేదా ప్రశంసలను అందుకోవచ్చు.అక్టోబర్ నెల మీ కోసం మంచి వార్తలను కూడా తెస్తుంది. మీరు మీ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. మీరు మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. మీ ప్రేమ జీవితం ఉత్తేజకరంగా ఉంటుంది. మీరు మీ లవ్ పార్ట్‌నర్‌ను జీవిత భాగస్వామిగా చేయాలనుకుంటే ఈ సంవత్సరం మీ సంకల్పం నెరవేరవచ్చు.

కుంభరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కుంభరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

కుంభరాశి వారికి 2019 ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితి ఈ సంవత్సరం బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండి మరింత శక్తివంతంగా ఉన్న అనుభూతి చెందుతారు.మీలో ఉత్సాహం అభిరుచి మరియు అసాధారణ శక్తి చాలా ఉంటుంది. ఈ సంవత్సరం మీ కెరీర్ ఊపందుకుంటుంది. మీరు మీ పనిలో విజయాన్ని పొందుతారు. మీ నిర్ణయాలు కెరీర్ ను మరింత ఆకర్షణీయంగా చేయడంలో సహాయం చేస్తాయి .మీ అద్భుతమైన నిర్ణయాలు ద్వారా మీరు మీ కోసం గొప్ప అవకాశాలను సృష్టించుకుంటారు. మీ ఆర్థిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

ఈ సంవత్సరంలో ఆర్ధిక లాభాలను స్వీకరించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన డబ్బు మీకు లభిస్తుంది .అలాగే మీరు ఈ ఏడాది పొడవునా సంపదను కూడగట్టడంలో విజయవంతం అవుతారు. మార్చి తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం యొక్క బహుళ వనరులు లభించడంతో పాటు మీరు ఆర్థిక పరంగా ఆనందంగా ఉంటారు.ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అభివృద్ధి కొంత నెమ్మదిగా ఉంటుంది.మార్చి నెల వరకు మీరు మీ ప్రేమ జీవితంలో అనేక హెచ్చు తగ్గులు ఎదుర్కోవలసి ఉంటుంది.ఈ సమయంలో మీ ప్రేమలో పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. మీ ప్రియమైనవారితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకోకండి.

మీనరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మీనరాశి వారికి 2019 సంవత్సర రాశిఫలాలు

మీన రాశి వారికి 2019 ప్రకారం మీ ఆరోగ్యం ఈ సంవత్సరం మంచి స్థితిలో ఉంటుంది. అయినప్పటికీ మీ ఆరోగ్యం గురించి మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకునేందుకు యోగా, వ్యాయామాలు, జిమ్మింగ్, రన్నింగ్ మొదలైనవి చేయాలి. రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరమైనదిగా చేసుకోండి.

ఉదయాన్నే లేవండి మరియు రాత్రి సమయంలో త్వరగా సమయానికి నిద్రపోండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంతగా నిద్రించండి. మనస్సు స్థిరంగా ఉంచడానికి ధ్యానాన్ని కూడా ఎంచుకోవచ్చు.మీరు మానసికంగా మరియు భౌతికంగా సరిగా ఉంటే ఈ సంవత్సరం మీ కెరీర్ ఉన్నత స్థానానికి దూసుకుపోతుంది.కార్యస్థలంలో మీరు కొత్త గుర్తింపుని పొందుతారు .

కష్టపడి పనిచేసే అంకితమైన మరియు నిజాయితీతో కూడిన వ్యక్తిగా మీకు వృత్తిపరమైన గుర్తింపు వస్తుంది.మీరు ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది అందువల్ల ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి.ప్రమాదకర నిర్ణయాన్ని అమలుచేసే ముందు దాని గురించి బాగా ఆలోచించండి లేకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని అనుభవిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ ప్రేమ జీవితం పట్ల గందరగోళ స్థితిలో ఉండటానికి అవకాశం ఉంది.మీ ప్రేమబంధాన్ని సంబంధించి మీ మనస్సులో ఒక ప్రత్యేక సందేహం రేగవచ్చును.ఒక నిర్దిష్ట అంశంపై మీ ప్రేమ భాగస్వామికి మీకు మధ్య తీవ్రమైన వాదోపవాదం తలెత్తవచ్చును.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
2019 year horoscope: Rasi Phalalu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more