వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్లీల వెబ్ సైట్ కు కోర్టు జరిమానా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అశ్లీల వెబ్‌సైట్‌తో ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ 'టీ సిరీస్‌' పరువుకు నష్టం కలగజేసినందుకు అమెరికాకు చెందిన ఓ సంస్థతోపాటు ఇద్దరు చైనా వ్యక్తులకు (సైబర్‌ పైరేట్స్‌) ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. సదరు కంపెనీకి ఉమ్మడిగా రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. వాంగ్జీ జుసె యంగ్‌హు, యింగ్‌ తర్‌ వాంగ్జూ లీ బు అనే ఇద్దరు సాంకేతిక నిపుణులు 'సూపర్‌క్యాసెట్స్‌' పేరుతో ఇంటర్నెట్‌లో 2003 సెప్టెంబరు 23న ఓ అశ్లీల వెబ్‌సైట్‌ రూపొందించారు.

ఈ సైట్‌ పేరు తమ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని టీ సిరీస్‌కు చెందిన సూపర్‌ క్యాసెట్స్‌ కంపెనీ కోర్టుకెక్కింది. సదరు వెబ్‌సైట్‌ రూపకల్పనలో అమెరికాకు చెందిన 'ఐసీఎల్‌' కంపెనీ కూడా పాలుపంచుకొందని తెలిపింది. కేసును విచారించిన కోర్టు.. అశ్లీల వెబ్‌సైట్‌కు టీ సిరీస్‌కు చెందిన సూపర్‌క్యాసెట్స్‌ పేరును వాడుకోరాదంటూ 2004 జులై 23న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అదే ఏడాది సెప్టెంబరు 27న నిర్వాహకులు సైట్‌ను మూసేశారు. తాజాగా ఈ కేసు మరోమారు విచారణకు వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X