ఇద్దరిలో ఒకరు సిఎం: తారకరత్న

కాబోయే సీఎంకు, రాబోయే సీఎంకు అన్నపదాలకు ఎంతో తేడా ఉందని, మీడియా తన వ్యాఖ్యలను వక్రీ కరించిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబాయ్ ఆదేశిస్తే ప్రచారానికి సిద్ధమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు. మేడపాటి ప్రకాష్‌రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి వచ్చా రు.
ఈ సందర్భంగా జరిగిన సభలో తారకరత్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బాబాయి బాలకృష్ణ ఒక్కమగాడు అని కొనియాడారు. తాత ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామనిఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడమే తన ధ్యేయమన్నారు.












Click it and Unblock the Notifications