అమెరికాలో తెలుగు చలన చిత్రోత్సవం
హైదరాబాద్: తెలుగు సినిమా చిత్రోత్సవం తొలిసారిగా అమెరికాలో జరగనుంది. ఈనెల 15నుంచి 18వరకు న్యూజెర్సీలో ఈ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా 2008లో విడుదలైన 14 చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. టాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో అమెరికన్ తెలుగు టీవీ ఈ వేడుకను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో కృష్ణ, ఆటాడిస్తా, రెఢీ, కొత్త బంగారులోకం, వాన, పరుగు, ఉల్లాసంగా-ఉత్సాహంగా, యువత, ఒంటరి, బతుకమ్మ, గమ్యం, కంత్రి, కథానాయకుడు, ఎక్కడికెళుతుందో మనసు చిత్రాలను ప్రదర్శిస్తారు. వివిధ విభాగాల్లో ప్రేక్షకులు ఎంచుకున్న చిత్రాలకు వివిధ విభాగాల్లో అవార్డులు బహుకరిస్తారు.












Click it and Unblock the Notifications