హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ ప్రచారయాత్ర డైరీ

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: బాలయ్య పూర్తి స్ధాయిలో పార్టీ ప్రచారానికి నడుం బిగించనున్నారు. అందుకోసం ఆయన పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్ళనున్నారు. బాలయ్య ఈ నెల 29న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అందుకోసం 28న హైదరాబాద్‌నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లి అక్కడినుంచి హిందూపురం చేరుకుంటారు. 29, 30 తేదీల్లో అనంతపురం జిల్లాలలోనూ, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో కర్నూలు జిల్లాలోనూ ఆయన యాత్ర జరుగుతుంది. అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. 3, 4 తేదీల్లో శ్రీకాకుళం, 5, 6న విజయనగరం, 7న విశాఖపట్నంలో ప్రచారయాత్ర ఉంటుంది.

ఆదివారం చంద్రబాబు ఇంట్లో బాబుతోపాటు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు సమావేశమయ్యారు. బాలయ్య యాత్ర ఎలా ఉండాలన్న దానిపై వారిమధ్య కొంతసేపు చర్చ జరిగిందని సమాచారం. ఆ సమావేశంలో ప్రచారయాత్ర రోడ్డుషోల రూపంలో ఉండాలని నిర్ణయించారు. తొలి విడత పర్యటన ముగిశాక కొన్ని రోజుల విరామం అనంతరం కోస్తా జిల్లాల్లో పర్యటించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారంలోకి దిగితే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో పర్యటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X