న్యూఢిల్లీ: మన మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్(98) ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు చెపుతున్నారు. ఆయన జనవరి 12 వతేదీన డైలీరియాతో బాధపడుతూ డీహైడ్రోజేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు ఈ కోలి యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ సమస్య కూడా ఉంది. ప్రస్తుతం కృత్రిమ ఆక్సిజన్ తో శ్వాసని కల్పిస్తున్నారు. ఓ నిపుణులైన ప్రత్యేక వైద్య బృదం ఆయన సేవలకై పనిచేస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. 1987- 96 మధ్య ఆయన రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు.