జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన!
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయటం సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల సత్తా ఏ పార్టీకి లేకపోవటంతో అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. తన వారసుడిగా శిబూసొరేన్ ప్రతిపాదించిన చంపాయిసొరేన్ పేరును కాంగ్రెస్ తిరస్కరించింది.
సంకీర్ణం ఏర్పాటయ్యే అవకాశం కూడా లేనందున రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సయ్యద్ సిబ్తె రజీ సిఫార్సు చేశారు. దీనిపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితిపై చర్చ జరిగింది. అక్కడ పరస్థితులు చక్కబడేవరకు రాష్ట్రపతి పాలన విధించాలని మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈమేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు.












Click it and Unblock the Notifications