ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిలదీస్తునే ఉంటా: పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pavan kalyan
ఖమ్మం: 'జరగాల్సిన న్యాయం జరక్కపోతే ఎవరినైనా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే హక్కు నాకుంది. మీ నాయకులకు చెప్పండి. కాంగ్రెస్‌ అయినా, తెలుగుదేశం అయినా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే నిలదీస్తునే ఉంటాం అంటూ యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ప్రజా అంకితయాత్రలో భాగంగా ఆయన శనివారం పాల్వంచ నుంచి ఖమ్మం వరకూ రహదారిపై ప్రదర్శన (రోడ్‌ షో) నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో 'తెలుగుదేశం పార్టీని తిట్టవద్దు' అంటూ రాసిన కాగితపు ముక్కను ఓ వ్యక్తి పవన్‌కు పంపారు.

అది అందుకున్న పవన్...నాకు వ్యక్తిగతంగా ఏ తెలుగుదేశం నాయకుడిపైనా, కాంగ్రెస్‌ నాయకుడిపైనా కోపం లేదు. మీరు తప్పులు చేస్తూనే ఉంటూ.. మమ్మల్ని వేలెత్తి చూపొద్దంటే ఊరుకునేది లేదు. తప్పులను వేలెత్తి చూపి ఎలుగెత్తి చాటకపోతే మేమొచ్చి ప్రయోజనమేంటి? ఇంతమంది జనాన్ని మోసం చేసినట్టు కాదా' అంటూ ప్రశ్నించారు.

'వీళ్లంతా జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు. దశాబ్దాల తరబడి అధికారం వెలగబెడుతునే ఉన్నారు. కోట్లు కొల్లగొట్టిన నాయకులంతా ప్రజలకిచ్చిన వాగ్దానాలను మాత్రం అటకెక్కించారు. జనానికిచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నిలదీస్తునే ఉంటా' అంటూ పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు.''కాంగ్రెస్‌ నాయకులంటే నాకు ఎప్పుడూ అభిమానమే. వాళ్లిచ్చిన 'ఇందిరమ్మ' ఇళ్లు రెండున్నరేళ్లకే కూలిపోతున్నాయి. అభివృద్ధి అంటే ఇదా. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడుతోందా'' అంటూ ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X