అల్లు అరవింద్ పడిగాపులు

తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పరకాల ప్రభాకర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించాల్సి ఉంది. దాంతో అల్లు అరవింద్ ఆయన ఇంటికి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో మొదటి నుంచీ పాలు పంచుకున్న ఆంజనేయరెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడ పరకాల ప్రభాకర్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. పరకాల ప్రభాకర్ నర్సాపురం లోకసభ స్థానాన్ని ఆశించారు. టిక్కెట్ల పంపకంలో జరిగిన వ్యవహారాన్ని నిరసిస్తూ ఒక్కరొక్కరే వెళ్లిపోతుండడం ప్రజారాజ్యం పార్టీకి తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications