అసలు కోవర్టులు చిరు, అల్లు: రోజా

చిరంజీవికి వెనక్కి చూసుకునే సమయం కూడా లేదని, చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకునే సరికి అల్లు అరవింద్ ఒక్కరే ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు. డబ్బుల సంపాదనకే చిరంజీవి పార్టీ పెట్టారని అందరూ అనుకుంటున్నారని ఆమె అన్నారు. కులం పేరుతో పార్టీని ముందుకు తెస్తున్నారని ఆమె విమర్శించారు. కుటుంబానికి మాత్రమే న్యాయం చేస్తున్నారని, అందువల్ల తమకు చిరంజీవి ఏమీ చేయరని ప్రజలు అనుకుంటున్నారని ఆమె అన్నారు. చిరంజీవి సభలకు మహిళలు రావడం లేదని, అది పెద్ద మైనస్ పాయింట్ అని ఆమె అన్నారు. ఇప్పుడే కాదు, పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి మహిళలకు ఏపాటి గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసునని, చిరంజీవి మహిళలంటే గౌరవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications