చిరు జతకానికి అల్లు ఆటంకం

Allu Aravind
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి జాతకం చూద్దామని ఆశపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రాగు వ్యక్తిగత జ్యోతిష్కుడు నారాయణ రమణారావుకు అల్లు అరవింద్ అడ్డుపడ్డారు. చిరంజీవిని కలిసేందుకు ఆయనకు అల్లు అరవింద్ అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు. చిరంజీవికి జ్యోతిష్యంపై నమ్మకం లేదని కొట్టిపారేశారు. తెలుగుదేశం, తెరాసల మధ్య పొత్తుకు ముహూర్తం నిర్ణయించింది నారాయణ రమణారావే. ఆదివారం ఆయన ప్రజారాజ్యం కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ ను కలిశారు.

చిరంజీవికి జాతకాలపై నమ్మకం లేదని అల్లు అరవింద్ నారాయణ రమణారావుకు తేల్చి చెప్పారు. 'మనం ఉన్నదిఉన్నట్టుగా మాట్లాడుకుందాం. ఆయనకు ఇవన్నీ ఆసక్తి ఉండవు. మీరు కలిసినా ఉపయోగం ఏముంటుంది?' అని అరవింద్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అరవింద్‌ కారెక్కి వెళ్లబోతుండగా నారాయణ ఆయన చేయి పట్టుకుని రేఖలను పరిశీలించే ప్రయత్నం చేశారు. 'వద్దు వద్దు'అంటూ చేయిని బలవంతంగా వెనక్కు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+