చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి జన్మదిన వేడుకలు ఘనం జరిగాయి. అభిమానులు, డీఎంకే పార్టీ కార్యకర్తల మధ్య కరుణ తన 86వ పుట్టిన రోజును జరుపుకున్నారు. మొదట తన నివాసంలో కుటంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న కరుణ అనంతరం పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అందరి సమక్షంలో కరుణ కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.