హైదరాబాద్‌లో మరో స్వైన్‌ఫ్లూ కేసు
హైదరాబాద్: హైదరాబాద్‌లో తాజాగా మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదయ్యింది. లండన్ నుంచి నగరానికి వచ్చిన 30 యేళ్ళ యువకుడ్ని పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దాంతో అతనిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు.
దేశంలోని అన్ని నగరాల్లోకన్నా హైదరాబాదులోనే ఎక్కువ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి సోకుతోంది.












Click it and Unblock the Notifications