మన వైఖరి మారలేదు: సోనియా

ముంబై దాడుల్లో పాత్ర ఉన్నవారిపై చర్యలు తీసుకుని, ఉగ్రవాద నిరోధం విషయంలో హామీలను నిలబెట్టుకుంటే తప్ప పాకిస్తాన్ తో చర్చలు జరగవని ఆమె అన్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని సోనియా చెప్పారు. ఎన్నికల ప్రణాళిక హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నామనే విషయాన్ని మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆమె సూచించారు. సహాయ మంత్రులకు కేబినెట్ మంత్రులు బాధ్యతలు అప్పగించాలని కూడా ఆమె చెప్పారు. రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మంత్రులు కచ్చితంగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications