మాజీ బాయ్ ఫ్రెండ్ పై రాఖీ దయ

తాను ఈలేష్ ను పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా సిద్ధపడ్డానని, అయితే తనను అర్థం చేసుకోవడానికి ఈలేష్ కొంత సమయం కోరుతున్నాడని, అతనిపై తనకు విశ్వాసం ఉందని, అతను సమయం కావాలంటున్నప్పుడు తాను ఎలా బలవంత పెడతానని, అతను కోరుకున్నంత కాలం నిరీక్షించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అంటోంది. అయితే ఆమె కెనడాకు తన మకాం మార్చడానికి మాత్రం సిద్ధంగా లేదు. తన కెరీర్ ముంబైతో ముడపడి ఉందని, అతను అందుకు అనుగుణంగా తన భవిష్యత్తును మార్చుకోవాల్సి ఉంటుందని ఆమె అంటోంది.కాగా ఇద్దరు కలిసి ఈలేష్ సోదరి పెళ్లి కోసం టోరంటో వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications