ప్రకాష్ రాజ్ తో పెళ్లి కుట్ర: శోభరాణి
హైదరాబాద్: తాను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి అంటున్నారు. ప్రకాష్ రాజ్, తాను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు తనకు కూడా వచ్చాయని ఆమె ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఇదంతా న్యూసెన్స్ అని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల్లోని తానంటే గిట్టని వారు ఈ పని చేసి ఉంటారని, ఫొటోలను చాలా తెలివిగా రూపొందించారని, ఇదంతా తన రాజకీయ జీవితాన్ని పాడు చేయాలనే కుట్రతో జరిగిందని ఆమె అన్నారు.
ప్రకాష్ రాజ్ తో తనకు పెద్దగా పరిచయం లేదని, ఒక్క సినిమా షూటింగ్ లో మాత్రం తాను ప్రకాష్ రాజ్ తో మాట్లాడానని ఆమె చెప్పారు. తన కుటుంబంలో గొడవలున్న మాట వాస్తవమేనని, అయితే తాను తిరిగి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని, తాను రాజకీయాల్లో ఉన్నానని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రకాష్ రాజ్ శోభ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తాను విన్నానని ఆమె అన్నారు. ఈ వివాదం విషయంలో కుట్ర చేసిన వారి విజ్ఞతకే అసలు విషయాన్ని వదిలేస్తున్నానని ఆమె అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో తనకు ఏ విధమైన ఇబ్బందులు లేవని, రాజకీయంగా తన ఎదుగుదలను సహించని వారే ఆ పనికి పూనుకుని ఉంటారని ఆమె అన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications