ఆ పుకార్లు నమ్మద్దు : రోశయ్య
హైదరాబాద్ :వరద పరిస్థితిపై పుకార్లను నమ్మొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కె. రోశయ్య సూచించారు. ''ప్రభుత్వం ఏ విషయమూ దాయడానికి సిద్ధంగా లేదు. సత్యాన్ని కప్పిపుచ్చబోం. ఇదే సమయంలో పుకార్లు సృష్టించి భయాందోళనలు కలిగించడం మంచి పద్ధతి కాదు'' అని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితి కొంత వరకు తగ్గుముఖం పట్టిందని, అయితే జూరాల, ప్రకాశం బ్యారేజీల వద్ద పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని రోశయ్య చెప్పారు. వరద పరిస్థితిపై ప్రభుత్వం ఎక్కడా ఏమీ దాయడం లేదని, కొంత మంది పుట్టిస్తున్న పుకార్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!