వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖ సొంత జిల్లాకు రాక

By Santaram
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: వైయస్ జగన్ ను అనుకూలంగా ధైర్యంగా ప్రకటనలు చేసి మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా కొండా సురేఖ వరంగల్‌కు ఈ నెల 11న రానున్నారు. రాజీనామా సమర్పించాక వెంటనే జిల్లాకు వస్తారని పార్టీ శ్రేణులు భావించారు. కాగా, ఆమె పావురాలగుట్ట సందర్శనకు కూడా హైదరాబాద్‌ నుంచే వెళ్ళారు. మంత్రి పదవి చేపట్టి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆమెకు భారీ స్వాగతం లభించింది. పెంబర్తి నుంచి భారీ ర్యాలీ చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో అక్కడి నుంచే సురేఖను జిల్లాకు స్వాగతించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో కొండా వర్గీయులు తలమునకలయ్యారు. ఉదయం 10 గంటలకు కొండా దంపతులు పెంబర్తికి చేరుకుంటారు. అక్కడ శ్రేణులు భారీ స్థాయిలో స్వాగతం పలుకుతారు.

దాదాపు 500 వాహనాలతో ర్యాలీగా తరలివస్తారు. జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మడికొండ తదితర ప్రాంతాల్లో సురేఖ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతారు. మడికొండలో కార్పొరేటర్‌ మర్రి జనార్దన్‌ పటేల్‌ స్వాగ తం పలుకుతారు. అక్కడి నుంచి సుబేదారిలోని డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కొండా దంపతులు పూలమాలలు వేసి నివా ళులర్పించిన అనంతరం ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొండా దంపతులు వంచన గిరికి బయలుదేరి వెళతారు. రాజీనామాకు దారి తీసిన కారణాలు, భవిష్యత్తు కార్యచరణను సురేఖ వెల్లడించనున్నట్లు కొండా వర్గీయులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X