రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదృశ్యమైన మహిళ కేసు మిస్టరీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ అదృశ్యమైన చంద్రలీల కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని మానవహక్కుల కమిషన్ తప్పు పట్టింది. అదృశ్యమైనట్లు చెబుతున్న చంద్రలీలతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మహిళ సోదరుడు అప్పన్న, నిందితుడైన కారు డ్రైవర్‌ సాయిని ఈ నెల 13న హైద్రాబాద్‌లోని కమిషన్‌ ఎదుట హాజరు పరచాలని మానవ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

చంద్రలీల ఆత్మహత్య చేసుకున్నట్లు గత నెల 31న త్రీటౌన్‌ పోలీసులు కేసును మార్పుచేస్తూ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మహిళ బంధువులు, దళిత సంఘాల నుంచి అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ జోక్యంతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది.

నగరంలోని కంబాలపేటలో నివసిస్తున్న చంద్రలీల అదృశ్యమైనట్లు ఆమె సోదరుడు అప్పన్న గత నెల 11న త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని మహిళ అదృశ్యం కేసుగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కారు డ్రైవర్‌ సాయి ఆమె అదృశ్యానికి కారణమని ఫిర్యాదులో పేర్కొనటమే కాకుండా దళిత సంఘాల సహకారంతో ఆమె బంధువులు ఆందోళనలు కూడా నిర్వహించారు. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X