హెడ్లీతో నాకేం సంబంధం లేదు: కంగనా

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమారుడ్ రాహుల్ భట్ తో తనకు పరిచయం కూడా లేదని ఆమె చెప్పారు. తనపై వస్తున్న వార్తలన్నీనిరాధారమని ఆమె ఒక ఇంగ్లీష్ టీవీ చానెల్ తో అన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా తనపై బురద చల్లుతున్నారని ఆమె అన్నారు. డేవిడ్ హెడ్లీతో గానీ రాహుల్ భట్ తో గానీ తనకు సంబంధాలు ఉన్నట్లు ఏ దర్యాప్తు సంస్థ కూడా చెప్పలేదని ఆమె అన్నారు. తనపై వస్తున్న వార్తాకథనాలన్నీ ఊహాగానాలేనని ఆమె కొట్టిపారేశారు. బాధ్యత గల పౌరురాలిగా తాను నిజమే చెబుతున్నానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications