సమైక్యాంధ్ర కోసం విశాఖలో విద్యా సంస్ధల బంద్

ఆంధ్రా యూనివర్సిటీలో ప్రారంభమైన సమైక్యాంధ్ర ఉద్యమం రోజుకో రకంగా ముందుకు సాగుతోంది. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడిప్పుడే ఉగ్రరూపం దాలుస్తోంది. విద్యార్థులు మంగళవారం ఏయూ నుంచి ఆర్.కె.బీచ్ వద్దగల పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ డప్పు వాయిద్యాలతో కేసీఆర్, అలపక్షాల దిష్టి బొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణా వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నినాదాలు చేశారు. చివరగా కేసీఆర్ దిష్టి బొమ్మకు మద్యం తాగి స్తూ విద్యార్థులు, ఆందోళనకారులు బోరున విలపించారు. అనంతరం దిష్టి బొమ్మలను దహనం చేసి, సముద్ర స్నానం చేశారు.
పొట్టి శ్రీరాములు విగ్రహానికి విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఆందోళనకారులు పాలభిషేకం చేసి, పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. కొంతమంది రాజ కీయ నాయకులు, వ్యాపారులు వ్యక్తిగత స్వార్థంతో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేపట్టారని ఆరోపించా రు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అనాలోచితం గా మాట్లాడుతున్నారని,ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని కోరారు.
తెలంగాణా నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏవిధంగా అధిష్టానం వద్దకు వెళ్తున్నారో ఆంధ్ర నేతలు కూడా సమైక్యాంధ్ర కోసం అధిష్టానం వద్దకు వెళ్తామని చెప్పారు. పీసీసీ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో స్వార్థ బుద్ధితో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లేవనె త్తడం దారుణమన్నారు. ఆంధ్ర నేతలంతా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.