ఇంచ్యూట్ మనీ మేనేజర్ ఇండియాలో విడుదల

Intuit Money Manager
బెంగళూరు: ఇంచ్యూట్ మనీ మేనేజర్ ను ఇంచ్యూట్ ఇన్ కార్పొరేషన్ నేడు విడుదల చేసింది. భారతదేశంలోని వినియోగదారుల కోసం ఇంచ్యూట్ రూపొందించిన మొదటి ఫైనాన్షియల్ సాఫ్ట్ వేర్ ఇది. వెబ్ ఆధారిత ఇంచ్యూట్ మనీ మేనేజర్ వినూత్నమైన పర్సనల్ ఫైనాన్స్ టూల్. ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో మీరు మీ డబ్బు పెట్టుబడులను ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా పెంచుకోవాలో వారానికోసారి విశ్లేషించి చూపిస్తుంది.

దీనివల్ల మీ విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయి. మీ డబ్బుని మేనేజ్ చేయడానికి ఇది తెలివైన మార్గం. ఈ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు సింగిల్ విండోలో వ్యక్తిగత ఆర్ధిక సమాచారాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అనేక బ్యాంకుల్లో ఉన్న మీఖాతాలను, పెట్టుబడులను ఇది ట్రాక్ చేసి మీకు ఎప్పటికప్పుడు చూపిస్తుంది. ఖర్చులు, పన్నుల వివరాలు కళ్ళ ముందు ఉంచుతుంది. పర్సనల్ ఫైనాన్స్ లు ఎంత ఆరోగ్యంగా ఉన్నయో చూపుతుంది.

మనీ కంట్రోల్ డాట్ కామ్ లో ఇంచ్యూట్ మనీ మేనేజర్ అందుబాటులో ఉంటుంది. దీని 90 రోజుల ఫ్రీ ట్రయల్ ను మీరు వాడుకుని చూడవచ్చు. ఇంచ్యూట్ మనీ మేనేజర్ వెబ్ సైట్ కు వెళ్ళి ఈ ప్రొడక్ట్ ను సంబంధించిన వివరాలు పొందవచ్చు. ఈ సందర్భంగా ఇంచ్యూట్ ఇండీయా మేనేజింగ్ డైరెక్టర్ ఉమాంగ్ బేడీ మాట్లాడుతూ " ఇంచ్యూట్ మనీ మేనేజర్ ఖాతాదారులకు ఫైనాన్స్ ను మేనేజ్ చేసుకునేందుకు సులభమైన మార్గం చూపిస్తుంది.

సంబంధిత సమాచారం ఒక్కచోటనే కన్పిస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. ఈ ఉత్పాదనను పరీక్షించుకున్న వారు హై రేటింగ్స్ ఇస్తున్నారు. 85 శాతం వినియోగదారులు తాము ఇతరులను కూడా తీసుకోమని చెబుతున్నామన్నారు. ఈ రకమైన ఉత్పాదనలు ఖాతాదారులు డబ్బు ఆదా చేసుకునేలా సహాయ పడుతూ మొత్తంగా ఆర్ధిక వ్యవస్ధకు మేలు చేస్తాయి" అన్నారు. ఇంచ్యూట్ ఇండియా మార్కెటింగ్ హెడ్ విటల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు కూడా ఇంది మంచి ప్యాకేజి అని చెప్పారు.

మనీ కంట్రోల్.డాట్ కామ్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 90 రోజుల ఫ్రీ ట్రయల్ తర్వాత కస్టమర్లు రోజుకు రూపాయికే ఈ సేవలు పొందవచ్చు. ఇంచ్యూట్ ఇన్ కార్పొరేషన్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కంపెనీ. చిన్న, మధ్య తరహా వ్యాపారసంస్ధలకు వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది. 1983 లో స్ధాపించిన ఈ కంపెనీ 2009 లో 3.2 బిలియన్ల వ్యాపారం చేసింది. అమెరికాలో ప్రధాన కార్యాలయాలు గల ఈ కంపెనీలో 8,200 మంది పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+