వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెహ్మాన్ కు రెండు గ్రామీ అవార్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

AR Rahman
లాస్ ఎంజెలెస్: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో పాటకు నిరుడు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ రెండు గ్రామీ అవార్డులు గెలుచుకుని భారత ప్రతిష్టను మరింత పెంచాడు. జయ హో పాటకు గాను ఆయన ఈ అవార్డులు గెలుచుకున్నారు. మోషన్ పిక్చర్ కు బెస్ట్ కంపైలేషన్ సౌండ్ ట్రాక్ ను అందించినందుకు ఒక అవార్డు లభించింది. బెస్ట్ మోషన్ పిక్చర్ సాంగ్ కు మరో అవార్డు లభించింది.

లాస్ ఎంజెలెస్ లో జరిగిన 52వ వార్షిక అవార్డుల ఉత్సవంలో రెహ్మాన్ ఈ అవార్డులు అందుకున్నారు. గ్రామీ అవార్డులతో రెహ్మాన్ పండిట్ రవిశంకర్, జకీర్ జుస్సైన్, విక్కు వినాయక్, విశ్వమోహన్ భట్ ల సరసన నిలిచారు. దేవుడు గొప్పవాడని మరోసారి నిరూపితమైందని రెండో అవార్డును అందుకుంటూ రెహ్మాన్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X