రాజకీయ కోల్డ్ స్టోరేజీలో చంద్రబాబు: బొత్స సత్యనారాయణ

తన ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు జెఎసిలు ఏర్పాటు చేసి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబు ఉచ్చులో పడకూడదని ఆయన సూచించారు. ఆలాంటి పార్టీతో జత కడితే కాంగ్రెసు విధానాలకు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి నుంచి కాంగ్రెసు బయటకు రావడం మంచిదని ఆయన అన్నారు. జెఎసిల నుంచి బయటకు రావాలనే వీరప్ప మొయిలీ ప్రకటన సీమాంధ్ర నేతలకు కూడా వర్తిస్తుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటుండడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ వాదన సరైందేనని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలుగుదేశం నాయకులు తెలంగాణను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications