మగధీర హిందీ రిమేక్ ను అడ్డుకుంటా: చారి

Magadheera
హైదరాబాద్: మగధీర హిందీ రీమేక్ చిత్రం విడుదలను అడ్డుకుంటానని చంఢేరి నవలా రచయిత ఎస్పీ చారి హెచ్చరిస్తున్నారు. తన నవల ఛండేరీ నవల ఆధారంగా ఈ సినిమా తీశారని, తనకు గుర్తింపు గానీ పారితోషికం గానీ ఇవ్వలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా హీరోగా తెలుగులో ఈ సినిమా నిర్మించినప్పుడే తాను అభ్యంతరం చెప్పానని ఆయన తెలిపారు.

తనకు తగిన గుర్తింపు, పారితోషికం ఇస్తానని నిర్మాత అల్లు అరవింద్ హామీ ఇచ్చారని, ఈ మేరకు మెయిల్ కూడా పంపారని, కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. తన నవల ఆధారంగా సినిమా రూపొంది విజయం సాధించిందనే ఆనందం మాత్రమే తనకు మిగిలింది తప్ప గుర్తింపు గానీ పారితోషికం గానీ లభించలేదని ఆయన అన్నారు. అదే సినిమాను హిందీలో రీమేక్ చేశారని, ఆ సినిమా విడుదలను తాను న్యాయపరంగా అడ్డుకుంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+