ఎస్పీ నుంచి జయప్రద, అమర్ బహిష్కరణ

Jayaprada
లక్నో: సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్, పార్లమెంటు సభ్యుడు జయప్రద పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. వారితో పాటు అమర్ సింగ్ కు విధేయులైన నలుగురు శాసనసభ్యులను కూడా పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. పార్టీపై, పార్టీ నాయకులపై విమర్శలు చేసినందుకు జయప్రద, అమర్ సింగ్ లను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఆ మధ్య కాలంలో అమర్ సింగ్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ స్థితిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. అయితే ఆయన అందుకు నిరాకరిస్తూ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. పార్టీ కోసం తాను పాడుచేసుకున్న కిడ్నీలను పార్టీ చీఫ్ ములాయం సింగ్ తిరిగి ఇస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఈ వాతావరణంలో జయప్రదతో పాటు నలుగురు శాసనసభ్యులు అమర్ సింగ్ కు అండగా నిలబడుతూ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇటీవల మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+