హైదరాబాద్: ఆ అధికారి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారుల సోదాల్లో బయటపడింది. నీటిపారుదల శాఖ అనంతపురం సిఇ నాగేశ్వరరావు ఇంటిపై ఎసిబి అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. శనివారం తెల్లవారు జామున 5 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. ఈ సోదాలు సాయంత్రం వరకు సాగే అవకాశం ఉంది. ఆ అధికారికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులున్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది. పది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అస్తులుంటాయని అనుమానిస్తున్నారు.
హైదరాబాదులోని ఎల్లారెడ్డిగుడాలో గల నాగేశ్వర రావు నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, అనంతపురంలో కూడా సోదాలు సాగుతున్నాయి. నాగేశ్వరరావు స్వంత జిల్లా కృష్ణాలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. నాగేశ్వరరావుకు 11 ప్లాట్లు, ఐదు ఇళ్లు ఉన్నట్లు సోదాల్లో తేలింది. రెండు షాపులు కూడా ఉన్నట్లు తేలింది. ఐదు కిలోల వెండి, బంగారం కూడా వెలుగు చూశాయి. బ్యాంకు లాకర్లను చూడాల్సి ఉందని ఎసిబి అధికారులంటున్నారు.