• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మహిళా రిజర్వేషన్లు ఇవ్వకుంటే వంటలేదు: గల్లా అరుణ

By Santaram
|

Galla Aruna Kumari
హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఇళ్లలో వంట వండేది లేదని, మగవాళ్లకు తిండిపెట్టేది లేదని రహదారులు, భవనాలశాఖ మంత్రి గల్లా అరుణ స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలులోకి రాకుంటే రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మహిళలను స్వతంత్రులుగా బరిలోకి దింపుతామని ఆమె శనివారం అసెంబ్లీ లాబీల్లో విలేఖరులతో అన్నారు.

ఈసారి మహిళా బిల్లుకు ఎదురులేదన్నారు. అరుణ వ్యాఖ్యానాలను విలేఖరులు డీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. తాను కూడా అరుణ పక్షమేనని ఆమె ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నానని చెప్పారు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణలు కూడా సంఘీభావం తెలిపారు. వచ్చే అసెంబ్లీలో 120 మంది మహిళా ఎమ్మెల్యేలను తీసుకురావడం తమ లక్ష్యమని ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X