హైదరాబాద్ లో రెండు అగ్నిప్రమాదాలు

Hyderabad
హైదరాబాద్: నగరంలో శుక్రవారం రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి. రాజేంద్రనగర్‌ బాబుల్‌ రెడ్డినగర్‌లోని మ్యాట్రిక్స్‌ ప్లాస్టిక్‌ కర్మాగారంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతం దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

మాదాపూర్‌ విఠల్‌నగర్‌ లోని ఫెడరల్‌ బ్యాంక్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏసీలు, ఫర్నిచర్‌ ధ్వంసం అయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి షార్ట్‌ సర్య్కూటే కారణమని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+