చంద్రబాబు నాయుడుకు రెండు నాల్కలు: కె చంద్రశేఖర రావు

పదవుల కోసమో, కాంట్రాక్టుల కోసమో ఉద్యమం ప్రారంభించలేదని ఆయన అన్నారు. పదేళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసమే తాము పని చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. రాజకీయ అధికారం మన వద్దనే ఉండాలని, కత్తి వాళ్ల వద్ద ఉంటే యుద్ధం ఎలా చేస్తామని ఆయన అన్నారు. తాను 2001లో తాను ఉద్యమం చేపట్టి గ్రామగ్రామాన తిరుతుండడంతో చంద్రబాబు అప్పుడు అధికారంలో ఉండి దేవాదుల ప్రాజెక్టుకు హడావిడిగా శంకుస్థాపన చేశారని, దానికి ఇప్పటికీ గతి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications