Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరు పర్యటన సీమాంధ్ర కుట్ర: నాయని

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే అప్పటి పరిణామాలు అప్పుడే ఉంటాయని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయని నర్సింహారెడ్డి చెప్పారు. పొలిట్‌బ్యూరో సమావేశ తీర్మానాలను సోమవారం మీడియాకు వెల్లడించిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పోలవరం పేరుతో చిరంజీవి పర్యటించడం సమైక్యవాదుల కుట్ర అని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటిస్తారని, కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయంపై, రాబోయే ఉప ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహరచనపై సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు. ఇటీవల జరిగిన తెరాస తొమ్మిదో వార్షికోత్సవంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి ప్రతినిధులు చేసిన సూచనలను పొలిట్‌బ్యూరో సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు.

ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదని, దీన్ని అధిగమించాలని పలువురు సభ్యులు సూచించారు. ఉప ఎన్నికలకు ముందే ఈ కార్యక్రమం పూర్తికావాలన్నారు. ఈ నెల 31లోపు సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలని నిర్దేశించుకున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో జూన్‌ 3లోపు మండలాలు, గ్రామాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించనున్నారు. వీరు జూన్‌ 3 నుంచి 10 వరకు పల్లెబాట కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో కనీసం ఎనిమిది లక్షల మంది విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు.

సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణ కార్యక్రమాలకు జిల్లాకో కన్వీనరును నియమించాలని నిర్ణయించారు. వారి పేర్ల ప్రకటన బాధ్యతను కేసీఆర్‌కే అప్పగిస్తూ సభ్యులు తీర్మానం చేశారు. ఒకట్రెండు రోజుల్లో కన్వీనర్లను ప్రకటిస్తామని పార్టీ పొలిట్‌బ్యూరో తెలిపింది. కన్వీనర్ల నియామక ప్రక్రియను ఈ నెల 10లోపు పూర్తిచేసి వారికి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని కూడా తీర్మానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+