షిర్డీ: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విలన్ వేషాలు వేశాడు. ఆయన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన శనివారం షిర్డీలో జరిగింది. ఆయన మీడియా ప్రతినిధులపై చిందులేశాడు. వారిని నెట్టేశాడు, దుర్భాషలాడాడు. ఇదేమిటని వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా ఆయన నిరాకరించారు.
తన తాజా చిత్రం కైట్స్ ప్రింట్లతో ఆయన శనివారం షిర్డీకి వచ్చాడు. ఆయన వెంట తండ్రి రాకేష్ రోషన్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. హృతిక్ రోషన్ తీరుపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.