హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంట గ్యాస్ సబ్సిడీపై చేతులెత్తేసిన రోశయ్య ప్రభుత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు నేపథ్యంలో సామాన్యులపై భారం పడకుండా చూస్తానని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఇచ్చిన మాట నీటి మూటే అయింది. వంట గ్యాస్ పై సబ్సిడీ ఇచ్చే విషయంలో మంత్రి వర్గ సమావేశం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం వంట గ్యాస్ సిలిండర్ పై 35 రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి మంత్రివర్గం విముఖత ప్రదర్సించింది. ఇప్పటికే సిలిండర్ పై రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 170 కోట్ల భారం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించలేదు. అదనంగా సిలిండర్ కు 35 రూపాయల సబ్సిడీని ఇస్తే ప్రభుత్వం మరో 450 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ స్థితిలో దాన్ని భరించడం కష్టమని మంత్రివర్గం అభిప్రాయపడింది.

కాగా, ఫీజుల రీయంబర్స్ మెంటు, బోధనా ఫీజుల చెల్లింపునకు మంత్రి వర్గ సంఘం చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో ఏకాభిప్రాయం కుదరలేదు. లక్ష రూపాయల ఆదాయ పరిమితి విధించి ఫీజుల రియంబర్స్ మెంట్ ఇవ్వాలనే మంత్రుల సంఘం చేసిన సిఫార్సుపై భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై నిర్ణయాన్ని మంత్రివర్గం వాయిదా వేసింది. కాగా, మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా వుంటే, ఐటి పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానం కింద ఐటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఐటి పార్కులు ఏర్పాటు చేసే సంస్థలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీని వల్ల లక్షా 50 వేల అదనపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఉద్యోగుల డిఎను 6.84 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఆల్మట్టి ఎత్తుపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సమర్థులైన న్యాయవాదులను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో ఆల్మట్టిపై కర్నాటక ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టాలని ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిని ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X