సినీ నటి ఆమనిపై వరకట్నం వేధింపుల కేసు

పెళ్లికి ముందు నుంచే బ్యాంక్ ఉద్యోగి అయిన దేవికళతో సన్నిహితంగా శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. శ్రీనివాస్ దేవీకళను మూడేళ్లకు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత లీలావతిపై వేధింపులు మరింత పెరిగాయి. ఆడపిల్లలు పుట్టడంతో మరింత వేధింపులు పెరిగాయని చివరికి భరించలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు లీలావతి వెల్లడించింది. భర్త శ్రీనివాస్, అత్త సరోజ, అతని సోదరి ఆమని, దేవికళ తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లీలావతి చెప్పింది. వరకట్న వేధింపులు, బహుభార్యత్వం కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం శ్రీనివాస్, అతని తల్లి సరోజ, దేవికళను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications