నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో యువతిపై ప్రేమోన్మాది దాడి: పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nizamabad
నిజామాబాద్: నిజామాబాదులో గురువారం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి సంచలనం సృష్టించింది. గౌతమి అనే యువతిపై నరేందర్ అనే యువకుడు దాడి చేసి పారిపోయాడు. గౌతమి ఇంట్లోకి వచ్చి వెనక నుంచి ఆమెపై కిరోసిన్ పోసి అతను నిప్పంటించాడు. ఈ దాడిలో గౌతమి గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. తనను ప్రేమించడం లేదనే కోపంతో అతను గౌతమిపై దాడి చేశాడు.

చాలా కాలంగా నరేందర్ అనే యువకుడు గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలో గౌతమి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన నరేందర్ గురువారం గౌతమిపై ఈ దాడికి దిగాడు. నరేందర్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X