టీఆర్ ఎస్ నేత కేసీఆర్ తాజాగా కలం పట్టి ఓ సినిమాకు పాట రాసారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ తీయబోతున్న కొత్త సినిమా కోసం కేసీఆర్ ఈ పాట రాశారు. తెలుగు భాష, సాహిత్యంపై మంచి పట్టున్న కేసీఆర్ పాటలు రాయటం కొత్త కాదు. అయితే సినిమాకి రాయిటం మాత్రం ఇదే మొదటి సారి. గతంలో పలు తెలంగాణ ఉద్యమ గేయాలను రచించిన అనుభవం ఆయనకు ఉంది. తెలంగాణ జన సామాన్యం సాధారణంగా ఉపయోగించే మాటలు..సామెతలతోనే ఈ పాట అల్లిక సాగిందని సమాచారం. ఇక శంకర్ ఈ చిత్రాన్ని అందరూ కొత్తవాళ్ళతో తీస్తున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం కోసం రీసెంట్ గా టాలెంట్ హంట్ కూడా నిర్వహించారు. అలాగే శంకర్ గతంలో భద్రాచలం, శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్ వంటి సామాజిక చిత్రాలు, జయం మనదేరా, రామ్ వంటి కమర్షియల్ చిత్రాలు డైరక్ట్ చేసారు.