హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరీక్షలు వాయిదా పడటంతో రేపు బందు లేదు: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ఫ్రీజోన్ విషయం తేలే వరకు ఎస్ఐ పరీక్షలు వాయిదా వేయాలన్న తెలంగాణ విద్యార్థుల డిమాండు మేరకు ప్రభుత్వం దిగి రావడంతో శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన తెలంగాణ బందును రద్దు చేసుకుంటున్నట్టు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. ఇది విద్యార్థుల విజయంగా ఆయన అభివర్ణించారు. ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తే త్వరలో తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయటం హర్షణీయమన్నారు. ఇది విద్యార్థుల, తెలంగాణవాదుల విజయమని ఆయన అన్నారు. రాత పరీక్షలను రద్దు చేయటం పట్ల సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల రద్దుకు విద్యార్థులు భారీ ఉద్యమాన్ని చేపట్టారన్నారు. అయితే ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటంతో మాత్రమే ఆగితే సరిపోదన్నారు. ఫ్రీజోన్ విషయం యుద్ధప్రాతిపదికపైన తేల్చాలన్నారు.

ప్రభుత్వం తన వద్దనున్న ఫైలును కేంద్రానికి పంపించాలని డిమాండు చేశారు. ఢిల్లీలో ఫైలు కదలడానికి ఒక ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారిని నియమించి నిత్యం పర్యవేక్షణ జరిపించాలని అన్నారు. ఎస్ఐ పరీక్షలు రద్దు కొరకు తెలంగాణలోని పది జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రజలు బాగా సహకరించారన్నారు. కాగా ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనందాలు వెల్లునిరిశాయి. ప్రభుత్వం దిగిరావడం యావత్ తెలంగాణ విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ఇది విద్యార్థుల విజయమంటూ నినాదాలు చేశారు. ఆర్ట్సు కళాశాల నుండి తార్నాక వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X